Trade Talk: ప్రతివారం సరికొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ థియేటర్ వద్ద వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. సినీ సెలబ్రిటీలు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే దీపావళి పండుగను పురస్కరించుకొని అమరన్, క, లక్కీ భాస్కర్ ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడు కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇక తదుపరి వారం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలు నవంబర్ 14వ తేదీ విడుదల అయ్యాయి.
కంగువ సినిమాతో పాటు వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమా కూడా అదే రోజు విడుదల అయింది. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి. సూర్య కంగువ సినిమా నైజాం ఏరియాలో పరవాలేదు అనిపించుకుంటూ ఉన్నప్పటికీ మట్కా సినిమా మాత్రం ఘోరంగా డిజాస్టర్ లను ఎదుర్కొంటుంది.
నైజాం ఏరియాలో తక్కువ థియేటర్లలో కంగువ సినిమా విడుదల అయింది. ఇటీవల థియేటర్ల సంఖ్య పెంచినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదనే చెప్పాలి అయితే మట్కా సినిమాతో పోలిస్తే కంగువ సినిమా కలెక్షన్ల పరంగా పరవాలేదనిపిస్తోంది. ఇక ఈ వారం కలెక్షన్ల పైనే ఈ సినిమా ఫలితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పాలి.
ఇక మట్కా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా దాదాపు 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని తెలుస్తోంది కానీ ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులకు గాను కేవలం మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ మాత్రమే రాబట్టాయని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా కూడా ఘోరాతి ఘోరమైన డిజాస్టర్ సొంతం చేసుకుందని చెప్పాలి. ఈ సినిమాలతో పాటు నిఖిల్ అప్పుడో ఇప్పుడో అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అనేది ఒకటి ఉంది అంటూ ప్రేక్షకులకు ఎవరికీ కూడా తెలియదు. ఎలాంటి ప్రమోషన్లను చేయకుండా ఈ సినిమాని విడుదల చేశారు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనే విషయాన్ని మేకర్స్ ముందే ఊహించారని చెప్పాలి.