బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న నటి అమీషా పటేల్. ఆ తర్వాత ఈమె నరసింహుడు సినిమాలో ఎన్టీఆర్ తో, నాని సినిమాలో మహేష్ బాబు తోనూ నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో నటించకపోయినా హిందీ, తమిళ సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చింది. అయితే అక్కడ కూడా చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న అమీషా గత సంవత్సరమే గదర్ 2 మూవీ తో తెరపై తళుక్కుమంది.
ఇక అమీషా పర్సనల్ విషయాలకు వస్తే ఆమె సినిమాల ద్వారా పాపులర్ అయిన దానికంటే పర్సనల్ ఎఫైర్లతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది. గతంలో తన కంటే 8 సంవత్సరాలు పెద్దవాడైన బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ తో ఎఫైర్ నడిపిందని ప్రచారం జరిగింది, ఆ వ్యవహారం ఐదేళ్లపాటు కొనసాగిన తరువాత చివరికి ఆ జంట విడిపోయింది. అలాగే కెరియర్ ప్రారంభించిన కొత్తలో పెళ్లి అయిన బిజినెస్ మాగ్నెట్లతో రిలేషన్స్ కొనసాగిస్తుందని వార్తలు వచ్చాయి.
ఆ తరువాత లండన్ కి చెందిన వ్యాపారవేత్త కరణ్ పూరీతోను,ఆపై ఐపిఎల్ జట్టు యజమాని అయిన నెస్ వాడియాతోను ఎఫైర్లు నడిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ఎఫైర్ తో వార్తల్లోకి ఎక్కింది అమీషా. తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన తన కొత్త బాయ్ ఫ్రెండ్ నిర్వాన్ పటేల్ బిర్లా తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫోటోతో పాటు నా డార్లింగ్ నిర్వాన్ బిర్లాతో.. లవ్లీ సాయంత్రం అంటూ ఒక క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతున్నాయి. మరి కొద్ది రోజులలో 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్న అమీషా తనకన్నా 20 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో ప్రేమలో పడటం గురించి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఆమె హీరోయిన్ గా అడుగుపెట్టేనాటికి నిర్వాన్ వయసు 6 ఏళ్ళు మాత్రమే అంటూ సెటైర్లు వేస్తున్నారు.