Nagachaitanya -Sobhita: సినీ నటుడు నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈయన సమంతకి విడాకులు ఇచ్చిన తరువాత శోభిత ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే శోభితతో ఆగస్టు నెలలో కుటుంబ సభ్యుల సమక్షంలో నాగచైతన్య నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ జరగబోతుందని అన్నపూర్ణ స్టూడియో వీరి వివాహ వేదిక కానుంది అంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి. తాజాగా వీరి పెళ్లి గురించి అధికారిక ప్రకటన కూడా తెలిపారు.
ఈ క్రమంలోనే పెళ్లి పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని, ఇరువురి కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఆహ్వానాలను అందజేస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీరి వెడ్డింగ్ కార్డును కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అక్కినేని కుటుంబ సభ్యుల నుంచి సెలబ్రిటీలకు ఇన్వైట్ చేస్తున్న వెడ్డింగ్ కార్డులో కేవలం శోభిత నాగచైతన్య అని ఉండగా శోభిత కుటుంబ సభ్యులు ఇన్వైట్ చేస్తున్న వివాహ పత్రికలో మాత్రం లక్ష్మీ శోభిత అని ఉండటం గమనార్హం.
ఇలా ఇరువురి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఈ పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ వెడ్డింగ్ కార్డు చూసిన ఫ్యాన్స్ శోభిత పూర్తి పేరు లక్ష్మి శోభితనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుందని తెలుస్తోంది. ఇక వీరి వివాహానికి అత్యంత సన్నిహితులు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇక పెళ్లిని మాత్రం తెలుగు సాంప్రదాయబద్ధంగానే నిర్వహించబోతున్నారని ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాటన్ని కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.