Nayanathara: ఆ సినిమా చేసేటప్పుడు అందరూ విమర్శించారు: నయనతార

Nayanathara: నేడు లేడీస్ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నయనతార పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఆమె నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన టీజర్ ని పోస్ట్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే నయనతార లైఫ్ పై నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ చేసారు. అది నేడు రిలీజ్ అయింది. ఈ డాక్యుమెంటరీలో తన కెరీర్, సినిమాలు, తన ప్రేమ పెళ్లి, కుటుంబం ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడింది నయన్.

ఈ డాక్యుమెంటరీలో నయనతారతో పాటు పనిచేసిన పలువురు హీరోలు, డైరెక్టర్స్, టెక్నిషియన్స్ కూడా కనిపించి నయన్ గురించి మాట్లాడారు. అయితే నయనతార శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా సమయంలో ఆమెపై భారీగా విమర్శలు వచ్చాయట. సీత పాత్ర ఆమె చేయకూడదు అని పలువురు గొడవలు కూడా చేసారట. దీనిపై ఆ సినిమాకు పనిచేసిన ఒక టెక్నిషియన్, నయనతార స్పందించారు. శ్రీరామరాజ్యం సినిమాకు పనిచేసిన ఒక టెక్నిషియన్ మాట్లాడుతూ.. సీత పాత్రలో నయనతార చేస్తున్నప్పుడు గొడవలు, అల్లర్లు అయ్యాయి.

ఆమెపై విమర్శలు వచ్చాయి. ఆమె సీత పాత్రకు వద్దని అన్నారు. కానీ ఆమె మాత్రం సినిమా అయ్యేంతవరకు నాన్ వెజ్ తినకుండా వెజ్ మాత్రమే తింటూ చాలా నిష్టగా ఉన్నారు అని తెలిపారు టెక్నీషియన్. ఈ విషయంపై నయనతార కూడా మాట్లాడుతూ.. ఆ సినిమా ఒప్పుకున్నాక చాలా మంది విమర్శించారు. కానీ నేను చేయాలనుకున్నాను. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికి నాకు గుర్తు. ఆ సినిమా షూటింగ్ లాస్ట్ డే నేను ఎమోషనల్ అయి నేను ఏడ్చాను. అప్పుడే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. ఒక వ్యక్తి నన్ను సినిమాలను వదిలేయమని చెప్పాడు. అతను నాకు ఇంక పని చేయకూడదు అని చెప్పాడు. నాకు అప్పుడు దారి లేక సినిమాలకు బ్రేక్ ఇచ్చాను అని తెలిపింది నయన్. అయితే నయనతారను సినిమాలు చేయొద్దు అన్న వ్యక్తి ఎవరో మాత్రం తెలపలేదు. శ్రీరామరాజ్యం షూటింగ్ తర్వాత నయనతార సినిమాలు మానేస్తున్నాను అని ప్రకటించింది. ఆ సినిమాకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకుంది నయనతార. అప్పుడు ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నాగార్జున గ్రీకు వీరుడు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నయన్.