Pushpa 2: పుష్ప 2 ట్రైలర్ పై ప్రశంసల వర్షం… మౌనం పాటిస్తున్న మెగా కుటుంబం?

Pushpa 2: పుష్ప సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. పాట్నాలో ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది అభిమానులు పాల్గొని సందది చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా పుష్ప2 సినిమా నుంచి విడుదలైన ఈ ట్రైలర్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ వీడియో పై ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. రాజమౌళి రాంగోపాల్ వర్మ వంటి ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఈ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇకపోతే ఈ ట్రైలర్ వీడియో పై మెగా ఫ్యామిలీ మాత్రం మౌనం వహిస్తున్నారు.

అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ట్రైలర్ గురించి మెగా కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయలేదు దీంతో మెగా కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గత కొంతకాలంగా మెగా కుటుంబం అల్లు అర్జున్ దూరం పెడుతూ వస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అలాంటి గొడవలు ఏమీ లేవు అన్నట్టు ఇటీవల అన్ స్టాపబుల్ కార్యక్రమంలో చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

ఇక తన సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాగా ఏ ఒక్కరు కూడా ఈ ట్రైలర్ వీడియో పట్ల స్పందించకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇలా మెగా కుటుంబం ఈ సినిమా ట్రైలర్ విషయంలో మౌనం పాటించడానికి కారణం లేకపోలేదని కేవలం అల్లు అర్జున్ తో, అలాగే అల్లు కుటుంబంతో ఉన్న విభేదాలే కారణమని చర్చలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికైనా మెగా కుటుంబ సభ్యులు ఈ ట్రైలర్ వీడియో పై స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.