Pawan Kalyan: రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు . మహారాష్ట్రలో ఫైర్ అయిన పవన్!

Pawan Kalyan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేటితో ఈ ప్రచార కార్యక్రమాలకు బ్రేకులు పడనున్నాయి. మైకులు మూగబోతున్నాయి. 20వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు నేడు ఆఖరి తేదీ. ఇదిలా ఉండగా ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ తెలుగు వారు ఎక్కడైతే ఎక్కువగా నివసిస్తున్నారు ఆయా ప్రాంతాలలో సభలు సమావేశాలను నిర్వహిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సభకు కొంతమంది తెలంగాణ నుంచి వెళ్లి స్థిరపడిన తెలుగు వాళ్ళు హాజరయ్యారు. ఆయనతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ పరిస్థితుల గురించి అలాగే ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన గురించి కూడా పవన్ ఈ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందోనని అన్నారు.

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి తనకు ఇష్టమైన పాట అని గుర్తు చేశారు. తెలంగాణ అంటే పోరాటాల గడ్డ అని పవన్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ ఆడపడుచులకు ప్రతినెల ఆర్థిక సహాయం చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు. ఇక ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు.

ఈ విధంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా కాంగ్రెస్ పాలన పట్ల కాంగ్రెస్ తీరుపై మహారాష్ట్ర సభలలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇక ఇటీవల రేవంత్ పాలన తెలంగాణలో అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ అయ్యారు అంటూ కూడా పవన్ ఆరోపణలు చేయడం గమనార్హం. ఇలా కూటమి తరపున పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని అందుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది.