AP Ministers: ఏపీ మంత్రులు.. ర్యాంక్ తగ్గితే వేటు తప్పదా

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరునెలల తర్వాత మంత్రివర్గ విస్తరణపై చర్చలు వేడెక్కాయి. జనసేన నుంచి నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని ఇప్పటికే ఊఆ క్లారిటీ వచ్చేసింది. అయితే, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై పట్టు చూపిస్తూనే, ర్యాంకింగ్స్‌ ప్రకటనతో కొత్త ఉత్సుకతను తెచ్చారు.

జనసేన కోటాలో నాగబాబుకు మంత్రి స్థానం ఖరారు కావడం, ఆయన ప్రమాణ స్వీకారం కోసం జనవరిలో మంచి రోజు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే టీడీపీ సీనియర్లు కూడా మంత్రివర్గంలో చోటు కోసం అధినేత వద్ద అప్పీలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఉటంకిస్తూ తమకు అవకాశం కల్పించాలనే ఆశతో ఉన్నారు.

ఇదిలా ఉంటే, చంద్రబాబు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కొందరి పనితీరుపై సంతృప్తిగా లేకపోవడంతో, ర్యాంకింగ్స్‌ ఆధారంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశాలపై చర్చ జరుగుతోంది. అయితే, ఇప్పుడు నాగబాబును మినహాయించి మంత్రివర్గ విస్తరణపై చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

టీడీపీ సీనియర్లు మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురుచూస్తున్నా, ప్రస్తుతానికి నిండా ఆశలు పెట్టుకోవడం కష్టమేనని భావిస్తున్నారు. చంద్రబాబు అంచనాల ప్రకారం, సమర్థత ఆధారంగా తన టీంను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రానున్న కాలంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చంద్రబాబు తీసుకునే నిర్ణయాలే కూటమి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్నాయి.