TG: తెలంగాణ రైతులకు ప్రభుత్వం బిగ్ అప్డేట్ వెల్లడించింది ఆరు గ్యారెంటీలలో భాగంగా రైతు భరోసా కూడా ఒకటి అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రైతు భరోసా పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందే విధంగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.
ఇందులో భాగంగానే తమ జిల్లావ్యాప్తంగా సాగులో ఉన్న భూమికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట ఇచ్చిన సొమ్ము పోడు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్లపాలైందనే ఆరోపణల నేపథ్యంలో రేవంత్ సర్కార్ సాగు భూములకు మాత్రమే ఈ రైతు భరోసా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏ రైతు అయితే భూమిని సాగులో పెట్టి ఉంటారు వారు మాత్రమే రైతు భరోసాకు అర్హులు. అలా కాదని బీడు పెట్టిన భూములకు, కొండలు గుట్టలు ఉన్నటువంటి పొలాలకు ఈ స్కీమ్ వర్తించదని ఇదివరకే అధికారులు వెల్లడించారు.సాగు చేస్తున్న భూములను గుర్తించేందుకు ఫీల్డ్ లెవల్ రిపోర్టుతోపాటు, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకుకోవాలని సూచించారు. ఇక ఈ విషయంపై డిసెంబర్ 30 తేదీ జరగబోయే రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో ఆమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రైతులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుబంధు పేరిట అనర్హులైనటువంటి వారందరికీ కూడా పెద్ద ఎత్తున నగదు జమ చేశారు కానీ నిజమైన రైతుకు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి ఏటా రైతుకు 15 వేల రూపాయలు ప్రభుత్వం అందజేయబోతున్నట్టు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే