Tollywood: ఏపీ సీఎంతో భేటీకి సిద్ధమైన టాలీవుడ్ స్టార్స్… ఏపీకి తరలి రానున్న ఇండస్ట్రీ?

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం చిక్కుల్లో ఉంది. పుష్ప 2 విడుదల సమయంలో సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు అయితే ఈ ప్రభావం ఇండస్ట్రీపై భారీ దెబ్బ కొట్టిందని చెప్పాలి. అల్లు అర్జున్ అరెస్టు కావడమే కాకుండా అల్లు అర్జున్ అరెస్టును ఆయనని తెలంగాణ సర్కార్ పూర్తిగా టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేశారు. ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ అయి బయటికి రావడంతో ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు ఆయన ఇంటికి వెళ్లి తనని పరామర్శించారు.

ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి ఏకంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తూ సినిమా ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఎలాంటి అదనపు షోలకు అదే విధంగా సినిమా టికెట్లు రేట్లు పెంచడానికి కూడా అనుమతి లేదని ఇవ్వనని కూడా తేల్చి చెప్పారు.

ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సెలెబ్రిటీలందరూ కూడా పూర్తిగా అయోమయంలో పడ్డారు. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలన్నీ విడుదలవుతున్నాయి ఇలాంటి తరుణంలో బెనిఫిట్ షోలు లేకుండా సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే భారీగా నష్టపోవాలని భావిస్తున్నారు. అయితే ఈ నష్టాల నుంచి బయటపడటానికి ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే దారి చూపించగలరని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఎంతోమంది సీనియర్ నిర్మాతలు దర్శకులు హీరోలు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.

సీఎం వారికి అపాయింట్మెంట్ ఇవ్వడమే ఆలస్యం వెంటనే వెళ్లి ఇండస్ట్రీలో తమ సమస్యలను చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. సంక్రాంతికి వచ్చే సినిమాలకు తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లు పెంచకపోతే నిర్మాతలు చాలా నష్టపోతారు.. ముఖ్యంగా ఈ సంక్రాంతి రేసులో రామ్ చరణ్ బాలకృష్ణ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి శిష్యుడే కావడంతో ఆయన చొరవ తీసుకుంటే తెలంగాణలో కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అందుకే సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ సెలబ్రిటీలు సీఎం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.ఇక రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ అనూహ్యమైన నిర్ణయం పట్ల ఇండస్ట్రీ కూడా ఆంధ్రకు వెళుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదే నిజమైతే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా తప్పనే చెప్పాలి. మరి సినిమాల విషయంలో రేవంత్ తన నిర్ణయం మార్చుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.