Ram Charan-Upasana: ఇంట్లో పనిచేసే వారితో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న చరణ్ ఉపాసన.. నెట్టింట ఫొటోస్ వైరల్!

Ram Charan-Upasana: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ఇద్దరికి సోషల్ మీడియాలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోగా ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూనే మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు బిజినెస్ వ్యవహారాలు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా నిర్వహిస్తోంది.

ఇకపోతే తాజాగా క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలబ్రిటీలు సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రిటీలు కూడా క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా తెలిపారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు పండగలు, పర్వదినాలను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రం ఈ విషయంలో మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. బుధవారం రామ్ చరణ్ ఇంట్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. భార్య ఉపాసన కూడా ఈ వేడుకల్లో పాల్గొంది.

వీరితో పాటు ఇంట్లో పనిచేసే సిబ్బంది కూడా వేడుకల్లో భాగం కావడం విశేషం. ఇంట్లో పని చేసే వారితో పాటుగా అపోలో హాస్పిటల్స్ సిబ్బంది కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు ఉపాసన. ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవడం కామన్ కానీ ఇంట్లో పని చేసే వారితో ఈ విధంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ చరణ్ దంపతులపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.