Tollywood: సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ.. దూరంగా ఉన్న చిరంజీవి బాలకృష్ణ.. ఇదే కారణమా?

Tollywood: టాలీవుడ్ సినీ పెద్దలు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి మాత్రం తన నిర్ణయంలో ఏ విధమైనటువంటి మార్పు లేదని, అసెంబ్లీలో చెప్పిన విధంగా అని తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలో అలాగే సినిమా టికెట్ల రేట్లు పెంచే విషయంలో తన నిర్ణయం మారదని తేల్చి చెప్పారు.

ఇక ఈ భేటీలో భాగంగా చిన్న హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోలు అందరూ కూడా హాజరయ్యారు దర్శకులు నిర్మాతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో భాగంగా స్టార్ హీరోలైనటువంటి చిరంజీవి బాలకృష్ణ మాత్రం పాల్గొనలేదు. ఇలా చిరంజీవి బాలకృష్ణ రాకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు.

ఇటీవల హైడ్రా పేరుతో టాలీవుడ్ సెలబ్రిటీలను రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బాలకృష్ణ ఇంటికి కూడా ఈయన మార్కు వేయడంతోనే బాలయ్య ఈ విషయంలో పూర్తిస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారని అందుకే ఈ భేటీలో పాల్గొనడం లేదని తెలుస్తుంది. అంతేకాకుండా బాలకృష్ణ మరోవైపు ఏపీ ఎమ్మెల్యే కావడంతో ఇక్కడికి రాకపోవడానికి ఆసక్తి చూపలేదని సమాచారం.

ఇక చిరంజీవి కూడా ఈ భేటీకి దూరంగా ఉన్నారు అందుకు కారణం గతంలో చిరంజీవి పెద్దగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయనకు కాస్త అవమానం ఎదురైంది అంటూ ఇప్పుడు ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు అందుకే మరోసారి అలాంటి అవమానాన్ని ఎదుర్కోకూడదన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇది నిజం కాదని, ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తన సినిమా షూటింగ్ పనులలో హైదరాబాదులో లేకపోవడం వల్లే రాలేకపోయారని సమాచారం.