Tirupathi: తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ… సనాతన ధర్మం ఎక్కడంటూ?

Tirupathi: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు అయినటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తిరుపతిలో ఈ ఘటనతో అన్యమత ప్రచారం జరుగుతుందని, కావాలని ఎవరో ఈ పనికి ఒడిగట్టారని హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాయల చెరువు కూడలిలో ఉన్నటువంటి ఈ విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టడంతో హిందూ సంఘాలు, స్వామీజీలు బజరంగ్ దళాలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి.

ఇలా అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టింది ఎవరు అనే విషయంపై దర్యాప్తు కూడా జరుగుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించడంతో అన్నమయ్య విగ్రహం పై శాంటా క్లాస్ టోపీ పెట్టింది ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టిన వ్యక్తి కూడళ్లలో పెన్నులు విక్రయిస్తూ ఉంటాడని గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇక ఈ విషయంలో పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆయనకు తెలిసి పెట్టారా లేక తెలియక పెట్టారా అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఎవరి ప్రోద్బలంతోనైనా అన్నమయ్య విగ్రహానికి ఇలా శాంటా క్లాస్ టోపీ పెట్టారా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవుల పండుగ అయిన క్రిస్మస్ పండుగకు ముందు రోజు జరిగిన ఈ ఘటన నేపథ్యంలో మత విద్వేషాలు రగలకుండా తిరుపతిలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలలో ఈ విధమైనటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కొంతమంది యువతులు తిరుపతి కొండ దగ్గర రీల్స్ చేయడం కలకలం రేపింది అదేవిధంగా ఇటీవల కొంతమంది కూటమి కార్యకర్తలు పబ్ తరహాలో అక్కడ పార్టీలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఇక్కడ అన్నమయ్య విగ్రహం పై సాంటా క్లాస్ టోపీ రావడంతో సనాతన ధర్మం ఎక్కడ ఏం చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపిస్తున్నారు.

తిరుపతి లో మరో అపచారం జరిగింది 😡..దేవుడికి santa క్లాజ్ పెట్టిన ఆగంతకులు#trending #kiski #tirupati