Tollywood: మెగాస్టార్ తో పాటు సీఎం రేవంత్ ని కలవబోతున్న టాలీవుడ్ ప్రముఖులు.. భేటీ అయ్యేది అప్పుడే!

Tollywood: సంధ్య థియేటర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఈ కేసు రోజురోజుకీ మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ సంధ్య థియేటర్ ఘటన తెలుగు సినిమా ఇండస్ట్రీపై గట్టిగానే ప్రభావం చూపించింది. దీంతో ఈ విషయాన్ని కాస్త గట్టిగా సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సంక్రాంతికి బరిలో నిలిచినా కొందరు నిర్మాతలు డైలమాలో పడ్డారు. ఈ విషయం గురించే సీఎం రేవంత్ ని కలవడం కోసం టాలీవుడ్ సినీ ప్రముఖులు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నేడు అనగా గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారట.

ఈ భేటీకి టాలీవుడ్ తరఫున ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌ రాజు, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, హీరో వెంకటేశ్ కుడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుందట. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దిల్‌రాజు తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా హాజరవుతారని సమాచారం. సంధ్య థియేటర్‌ ఘటనతో పాటు సినిమా పరిశ్రమ సమస్యలపై కూడా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది.

ఈ భేటీలో ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారట. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై దిల్‌ రాజు ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని డిసెంబర్‌ 26న చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులతో పాటు కలవబోతున్నట్లు ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు ప్రకటించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి అనుగుణంగానే ఆయన నిర్ణయాలను తీసుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.