AP: ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్… కీలక ఆదేశాలు జారీ!

AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అయిన మూడు నెలలలోనే గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు లక్ష ఇరవై వేల మందికి పైగా ఉద్యోగాలు పొందారు అయితే గత ఐదు సంవత్సరాల కాలంలో సచివాలయ వ్యవస్థ కారణంగా ప్రజలు ఎలాంటి సమస్య లేకుండా తమ పనులన్నింటిని పూర్తి చేసుకున్నారు.

ఇకపోతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగుల పట్ల కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే సచివాలయ ఉద్యోగస్తులు బయోమెట్రిక్ విషయంలో ఎన్నో ఆదేశాలను జారీ చేసింది ఉదయం సచివాలయ ఉద్యోగులు ఎప్పుడు హాజరయ్యారు సాయంత్రం విధుల నుంచి వెళ్లేటప్పుడు కూడా బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు హాజరుతో వారి జీతాలను లింక్ చేయాలని కూడా ప్రభుత్వం ఈ ఆదేశాల్లో పేర్కొంది. ఇది తప్పనిసరిగా జరిగేలా చూడాలని సచివాలయాలశాఖ డైరెక్టర్ శివప్రసాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జీఎస్ డబ్ల్యూఎస్ యాప్ లో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకూ, వీఆర్వో గ్రేడ్ 1 ఇలా హాజరు వేయడం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఎనర్జీ అసిస్టెంట్, వీఆర్వో గ్రేడ్ 2, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5,గ్రామ సర్వేయర్ , వార్డు అడ్మిషన్ కార్యదర్శులు కూడా 30 శాతం నుంచి 50 శాతం మాత్రమే ఇలా బయోమెట్రిక్ హాజరు కాలేదని తెలిపారు. ఇల వీరంతా సరైన సమయానికి రాకపోవటం వల్ల ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. ఇదంతా తిరిగి జిల్లా యంత్రాంగంపై భారం పెంచుతుందన్నారు. కాబట్టి ఇకపై కలెక్టర్లు ఈ విషయంలో డీడీవోలు నిబంధనల మేరకు పనిచేసేలా చూడాలని కోరారు.