Nagarjuna: సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అందరూ కూడా నేడు రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం మనకు తెలిసిందే. స్టార్ హీరోల నుంచి మొదలుకొని నిర్మాతలు దర్శకులు కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయి సినీ పరిశ్రమ గురించి సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి తెలియజేశారు అలాగే ఇటీవల రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు సినిమా టికెట్ల రేట్లు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి వారిలో హీరో నాగార్జున కూడా ఉన్నారు సాధారణంగా నాగార్జున ఇలాంటి కార్యక్రమాలకు ఎక్కడ వెళ్లారు కానీ ఈ భేటీలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. అదే విధంగా ఈయన రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
నాగార్జున రేవంత్ రెడ్డి మధ్య ఇటీవల కాలంలో కాస్త గ్యాప్ పెరిగిన సంగతి మనకు తెలిసిందే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై జులుం విదిలించారు. హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలను చెరువులను ఆక్రమించే అక్రమ కట్టడాలు నిర్మించిన వాటన్నింటిని కూడా కూల్చివేశారు. ఇందులో భాగంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంతో నాగార్జున ఏకంగా కోర్టుకు వెళ్లారు అదేవిధంగా కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ సైతం సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమంటూ ఇష్టానుసారంగా మాట్లాడటంతో ఈ విషయాన్ని నాగార్జునతో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా ఖండించారు అంతేకాకుండా తనపై పరువు నష్టం దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ భేటీలో నాగార్జున పాల్గొనరని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం ఈ భేటీలో పాల్గొని ఏకంగా రేవంత్ రెడ్డికి సాలువ కప్పి మరి సన్మానించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయినట్టేనని తెలుస్తుంది.