Jani Master: మరోసారి తెరపైకి వచ్చిన జానీ మాస్టర్ కేసు.. ఈసారి అరెస్టు ఇవ్వడం ఖాయం అంటూ!

Jani Master: టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు జానీ మాస్టర్ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తన తోటి మహిళా కొరియోగ్రాఫర్ తనని లైంగిక వేధింపులకు గురి చేశాడు మతం మార్చుకొని పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై జానీ మాస్టర్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టి దాదాపుగా నెల రోజుల పాటు జైల్లోనే ఉంచారు.

తాజాగా జానీ మాస్టర్ కేసులో నార్సింగి పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసారు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు ఆ లేడీ కొరియోగ్రాఫర్ ను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. త్వరలోనే జానీ మాస్టర్ ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే జానీ మాస్టర్ పై ఆ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 16 న ఫిర్యాదు చేయగా పోలీసులు జానీ మాస్టర్ ని సెప్టెంబర్ 19 న అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం కోర్టులో హాజరుపరిచి విచారించించి నెల రోజులు జైలులోనే ఉంచారు. అక్టోబర్ 24 న షరతులతో కూడిన బెయిల్ ని హైకోర్టు మంజూరు చేసింది. అక్టోబర్ 25న జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసు మూలంగా దాని మాస్టర్ కు వచ్చిన నేషనల్ అవార్డును సైతం హోల్డ్ లో పెట్టిన విషయం తెలిసిందే. అలాగే జానీ మాస్టర్ భార్య తన భర్త పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూనే సదరు మహిళా కొరియోగ్రాఫర్ పై ఆరోపణలు చేస్తూ కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. అయితే జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చాక ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడలేదు.

కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న జానీ మాస్టర్ ఇటీవలే మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు, డ్యాన్స్ ప్రాక్టీస్ కి, బయట ఈవెంట్స్ కి వెళ్తున్నారు.జానీ మాస్టర్ గతంలో కంపోజ్ చేసిన గేమ్ ఛేంజర్ సినిమాలోని సాంగ్ ఇటీవలే రిలీజ్ అయింది. జైలు నుంచి బయటకు వచ్చాక ఎవరూ అవకాశాలు ఇవ్వట్లేదని జానీ మాస్టర్ బాధపడినట్టు టాలీవుడ్ లో వినిపించింది. అయితే రామ్ చరణ్ కాల్ చేసి తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారని జానీ మాస్టర్ తెలిపారు. ఇప్పుడు ఈ కేసుని పోలీసులు మళ్ళీ తెరపైకి తీయడంతో జానీ మాస్టర్ మళ్ళీ అరెస్ట్ అవుతారా అని టాలీవుడ్ లో చర్చ నెలకొంది. ఈ సారి మాత్రం జానీ మాస్టర్ అరెస్టు అవ్వడం ఖాయం అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.