Naveen Polishetty: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి గురించి మనందరికీ తెలిసిందే. జాతి రత్నాలు మూవీ తో భారీగా గుర్తింపుని తెచ్చుకుని నవీన్ పొలిశెట్టి ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నవీన్ పొలిశెట్టి చివరగా మిస్టర్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా తరువాత నవీన్ కొత్త సినిమా ఏది అనౌన్స్ చేయకపోవడంతో అభిమానులు అప్డేట్ కోసం ఎదురు చూస్తుండగా ఇంతలోనే నవీన్ కు చిన్న యాక్సిడెంట్ అవ్వడంతో కొంతకాలం పాటు ఇంటికే పరిమితమయ్యాడు.
పూర్తిగా కోరుకున్న నవీన్ పొలిశెట్టి బాలయ్య బాబు షోలో శ్రీ లీలతో కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక అభిమానులు నవీన్ పొలిశెట్టి ఎప్పుడెప్పుడు కొత్త సినిమా అనౌన్స్ చేస్తాడా అని ఎదురు చూస్తుండగా తాజాగా అభిమానులకు ఒక ఊహించని షాక్ ఇచ్చాడు. ఏమిటంటే అప్పుడప్పుడు 2022 లో ప్రారంభమై ఆగిపోయిన అనగనగా ఒక రాజు సినిమాను మళ్ళీ తాజాగా కొత్తగా ప్రకటించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కొత్త టీజర్ వదిలారు మూవీ మేకర్స్. ప్రి వెడ్డింగ్ టీజర్ పేరుతో రిలీజ్ చేసిన ప్రోమో ఇంట్రెస్టింగ్ గానే ఉంది. రేపటి నుంచి పెళ్లి సందడి మొదలు అని ఇందులో పేర్కొన్నారు.
అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రి వెడ్డింగ్ టీజర్లో ఎక్కడా దర్శకుడి పేరు కనిపించలేదు. కేవలం ఆ టీజర్ లో హీరో, నిర్మాతల పేర్లు మాత్రమే ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని మొదలుపెట్టింది మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్‌తో. ఇదే తన తొలి చిత్రం కావాల్సింది. కానీ స్క్రిప్టు అనుకున్నంత బాగా రాకపోవడంతో ఈ సినిమాను మధ్యలో ఆపేశారని వార్తలు వచ్చాయి. రెండేళ్లకు పైగా ఈ సినిమా వార్తల్లో లేదు. దీన్ని పక్కన పెట్టేసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేశాడు నవీన్. ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకున్నాక ఇంకేదో కొత్తది, పెద్ద సినిమాను నవీన్ లైన్లో పెడతాడని అనుకున్నారు. కానీ అతను తిరిగి పాత సినిమా అనగనగా ఒక రాజు ని సెట్స్ మీదికి తీసుకెళ్తున్నాడు. ఇలా పక్కన పెట్టిన సినిమాను మళ్లీ లైన్లో పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకరే రూపొందించబోతున్నాడా, లేదా తెరపైకి కొత్త దర్శకుడు రాబోతున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది.