TG: సంధ్య థియేటర్ ఘటనలో బిగ్ ట్విస్ట్… రేవంత్ కావాలనే టార్గెట్ చేశారా.. సంచలనగా మారిన సీసీటీవీ ఫుటేజ్!

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే మహిళ మరణించడంతో ఈ వివాదం కాస్త అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది అల్లు అర్జున్ అక్కడికి రావడమే కారణమని, రేవతి అనే మహిళ మరణానికి అల్లు అర్జున్ పరోక్షంగా కారణం అంటూ తెలంగాణ పోలీసులు ఏఖంగా ఆయనని అరెస్టు చేసి ఒకరోజు మొత్తం జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇంతటితో ఆగకుండా ఇదొక పెద్ద సమస్యగా చిత్రీకరించిన రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో కూడా తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టి అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తూ ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అల్లు అర్జున్ సైతం ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదంటూ చెప్పుకు వచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి పూర్తిగా అల్లు అర్జున్ టార్గెట్ చేశారనే వాదన కూడా వినిపించింది. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్ మీద బయట ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి పోలీసులు ఆంక్షలు విధించారు సిటీ దాటి బయటకు వెళ్ళకూడదు విచారణకు పిలిచినప్పుడల్లా హాజరు కావాలి అంటూ పలు ఆంక్షలు విధించారు అయితే తాజాగా ఈ కేసు విషయంలో బిగ్ ట్విస్ట్ బయటపడింది తాజాగా ఒక సంచలనమైన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది అనే విషయానికి వస్తే… డిసెంబర్ 4న రాత్రి 9.16 గంటలకే రేవతి తొక్కిసలాటలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెను థియేటర్ నుంచి బయటకు తీసుకు వస్తున్నటువంటి క్లిప్స్ కనిపించాయి ఈ ఘటన జరిగిన సుమారు అరగంట తర్వాత అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు ఒక వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కేవలం 6 గ్యారంటీలను పక్కకు మళ్ళించడానికి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై ఇలా కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు తన పేరు మరిచిపోయినందుకే ఇలా రివెంజ్ తీర్చుకున్నారు అంటూ మరికొందరు రేవంత్ సర్కారుపై మండిపడుతున్నారు. అయితే పోలీసులు చూపించిన వీడియోలో మాత్రం డిసెంబర్ 4న రాత్రి 9.40 ప్రాంతంలో అల్లు అర్జున్ థియేటర్లోకి వచ్చినట్లుగా.. ఆ తర్వాత 9.45-9.50 గంటల మధ్యలో తొక్కిసలాటలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన రేవతి, శ్రీతేజ్ ను బయటకు తీసుకొచ్చినట్లుగా ఉంది.

ఆ వీడియోలో ఏముంది.? | Allu Arjun's mistakes.? | Sandhya Theatre Incident CCTV Footage | CP Anand