Actress Divi: బిగ్ బాస్ ఫేమ్ నటి దివి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దివి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై ఈవెంట్స్ లో సందడి చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా దివి సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేయడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
అసలేం జరిగింది అంటూ కామెంట్ వర్షం కురిపిస్తున్నారు. కాకా దివి తన కాలికి పెద్ద కట్టు కట్టిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోను బట్టి చూస్తే కాలికి ఏదో పెద్ద గాయమే అయిందని, లోపల ఎముకలకు పెట్టి ఇలా దెబ్బలు తగలడం వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కట్టు వేసినట్టు తెలుస్తోంది. గట్టిగానే దివి కాలికి గాయం అయినట్టు కనిపిస్తోంది. అయితే ఇది షూటింగ్లో జరిగిందా లేదంటే బయట ఎక్కడైనా జరిగిందా అన్న విషయాలు మాత్రం దివి వెల్లడించలేదు. తన కాలికి కట్టు కట్టగా దానిపై స్కెచ్ తో రాసుకుంటూ బొమ్మలు కూడా వేసుకుంటుంది దివి.
ఆ కట్టుతో ఉన్న తన ఫొటోలు షేర్ చేసి.. కొన్నిసార్లు మన పనిని కాలు మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు ఆపేస్తుంది కానీ ఎంటర్టైన్మెంట్ ని ఎందుకు ఆపాలి. అందుకే ఈ కట్టుని నాకు అడ్డంకిగా చూడకుండా బొమ్మలు గీస్తూ అందంగా తయారు చేస్తున్నాను. జీవితం అంటే కష్టాలను తప్పించుకోవడం కాదు. ఇలాంటి సమయంలో కూడా నవ్వాలి. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నా ప్రతి సెకండ్ ని ఆస్వాదిస్తున్నాను. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి దానిలో ఆనందం వెతుక్కుందాం అని పోస్ట్ చేసింది దివి. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు జాగ్రత్తలు చెబుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకొందరు అసలు ఏమయ్యింది చెప్పండి అంటూ ఆందోళన చెందుతున్నారు.