Revanth Reddy: నేడు సినీ సెలబ్రిటీలు అందరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భేటీ కానున్నారు. ఇటీవల అల్లు అర్జున్ విషయంలో చోటు చేసుకున్నటువంటి ఘటన పట్ల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలకు బెనిఫిట్ షోలు ఇవ్వటం వల్ల పెద్ద ఎత్తున తొక్కిసలాట జరుగుతుందని అందుకే ఇకపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఏ సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతి తెలపము అంటూ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రేవంత్ రెడ్డి ఈ నిర్ణయంతో ఎన్నో సినిమాలు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు రంగంలోకి దిగారు. ఇటు సినిమా ఇండస్ట్రీ తరపున అటు తెలంగాణ సర్కార్ మధ్య ఈయన కీలకంగా మారి ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయన కాస్త చొరవ తీసుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే నేడు పలువురు టాలీవుడ్ పెద్దలతో కలిసి రేవంత్ రెడ్డి ఇంట్లో ఆయనని కలిసి ఈ సమస్యపై పరిష్కారం పై చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఈ భేటీలో భాగంగా అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తారా అనే సందిగ్ధత ఏర్పడింది అయితే రేవంత్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళబోరని తెలుస్తోంది. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది అదేవిధంగా న్యాయ నిపుణుల సలహా మేరకు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళకపోవడమే మంచిదని సలహా ఇవ్వడంతోనే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి భేటీలో పాల్గొనడం లేదని సమాచారం. మరి ఇండస్ట్రీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. సినిమాల విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.