Rahul Gandhi: తెలంగాణ సర్కారుపై ప్రశంసలు కురిపించిన రాహుల్ గాంధీ.. పాలన శభాష్ అంటూ?

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఇలా అధికారం చేపట్టిన ఏడాది తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఇలా కాంగ్రెస్ మంత్రులకు ఈయన వారి శాఖ పరిపాలన గురించి ప్రశంసల కురిపిస్తూ లేఖ రాశారు ఈ క్రమంలోనే బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బుధవారం రాసిన లేఖలో హామీలను నేరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

రవాణా, బీసీ సంక్షేమ శాఖల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కాంగ్రెస్ విజన్ ఏంటనేది ముందుకు తీసుకెళుతున్నందుకు ఈయన అభినందనలు తెలిపారు. పేదల పట్ల తమ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ మీరు పార్టీ కోసం మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పరిపాలన విధానం గురించి రాహుల్ గాంధీ ప్రశంసిస్తూ లేఖ రాశారు.

ఈ క్రమంలోనే ఈ లేఖ పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనను పూర్తి చేసుకుంది ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దార్శనిక నాయకత్వంలో విజయవంతంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో తమ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామని, పేదలకు ప్రభుత్వ ఫలాలను అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అంటూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి పొన్నం ప్రభాకర్ రిప్లై ఇచ్చారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే తెలంగాణలో మాత్రం ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు పరచలేదు అంటూ సర్కారు తీరుపై ప్రజలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.