Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కలిశారు. ఇవాళ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈయన సినీ సెలెబ్రిటీలతో కలిసి భేటీ అయ్యారు. ఇక ఈ బేటిలో భాగంగా రేవంత్ రెడ్డి సినిమా సెలబ్రిటీలకు గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఇటీవల జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచేది లేదు అంటూ అసెంబ్లీలో మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఇక ఇదే విషయం గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అయితే ఈ భేటీలో భాగంగా ఈయన మాట్లాడుతూ తాను ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటానని తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్, ప్రీమియర్ షోలు ఉండవని తేల్చేశారు. అదేవిధంగా స్పెషల్‌గా సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ రైజింగ్ లో భాగంగా సినిమా ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని సూచించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం గురించి ప్రమోట్ చేయాలని తెలిపారు.
శాంతిభ్రదల విషయంలో రాజీ లేదని పేర్కొన్నారు. ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్ ఉంటామని.. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని అన్నారు. ఇక ఇండస్ట్రీకి ఇతర విషయాలలో ఎప్పుడు కూడా ప్రభుత్వ మద్దతు తప్పకుండా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం పైనే కట్టుబడి ఉన్నారు ఇక ఈయన నిర్ణయంతో తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా టికెట్ల రేట్లు పెంచే విషయంలో పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టమవుతుంది. మరి రేవంత్ నిర్ణయంతో సినీ సెలబ్రిటీల స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.