TG: చేతనైతే ఆ పని చేసి చూపించు.. సీవీ ఆనంద్ కు సవాల్ విసిరిన బీజేపీ ఎంపీ!

TG: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అల్లు అర్జున్ అరెస్ట్ విషయం పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతుంది. ఇక ఈ విషయంపై రేవంత్ రెడ్డి మౌనం ఉన్నప్పటికీ కూడా బీజేపీ నేతలు బిఆర్ఎస్ నేతలు స్పందిస్తూ రేవంత్ రెడ్డి తీరును తప్పుపడుతున్నారు అయితే తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ సైతం ఈ ఘటన పై మాట్లాడుతూ పూర్తిస్థాయిలో రేవంత్ రెడ్డి తీరును తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గురించి కూడా ఈయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లు అర్జున్ బౌన్సర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్లు కూడా కాస్త ఓవరాక్షన్ చేశారని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇకపై బౌన్సర్లు పబ్లిక్ మీద చెయ్యి వేసిన లేదంటే పోలీసులపై చెయ్యి వేసిన తాటతీస్తాము అంటూ వారికి తమదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. అదే విధంగా అల్లు అర్జున్ బౌన్సర్లలో ఒకరైనటువంటి ఆంటోని అనే వ్యక్తిని ఈ ఘటనలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ విషయం గురించి ఎంపీ రఘునందన్ ప్రవేట్ బౌన్సర్ల వ్యవస్థపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరంతా కోపగించుకుంటారని, అందరికీ శత్రువులు అవుతారంటూ పెద్దలు చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకొని అందరినీ నెట్టించే వ్యవస్థను ఆనాడు తీసుకు వచ్చింది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. ఇలాంటి సరికొత్త దుకాణం పెట్టిందే రేవంత్ రెడ్డి అంటూ ఈయన చురకలాంటించారు.

ఇక ఈ ఘటనలో అల్లు అర్జున్ ప్రైవేట్ బౌన్సర్లను ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రవేట్ బౌన్సర్ వ్యవస్థని రద్దు చేయాలి అంటూ ఈయన సవాల్ విసిరారు.