AP: వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు తరచూ సోషల్ మీడియాలోనూ అలాగే మీడియా సమావేశాలలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈయన మీడియా సమావేశంలో భాగంగా కూటమి నేతల గురించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వమం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ మూలన చిన్న గొడవ జరిగినా దానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణమని వైయస్ జగన్ ప్రభుత్వమే కారణమంటూ వైకాపా పార్టీపై నిందలు మోపుతున్నారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఏం జరిగినా ఆ నిందను మాపై వేయటం సరి కాదని అంబంటి తెలిపారు. అసలు మీకు కొంచమైనా సిగ్గుందా.. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడానికి కారణం ఎవరు? ఇలా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి కారణమైతే ఇక ఈ ప్రభుత్వం ఉన్నది దేనికి అంటూ ఈయన ప్రశ్నించారు. గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతుందా అని సీరియస్ అయ్యారు అంబటి రాంబాబు.
చంద్రబాబు, మోడీ, పవన్ చెప్పిన మాటలకు ప్రజలు నమ్మి ఓటు వేసి బాదపడుతున్నారు. ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగి ఉంటే వెంటనే దర్యాప్తు చేపట్టండి కక్ష సాధింపు రాజకీయాలకు తాము భయపడేది లేదని ఈయన తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో వైకాపా నాయకులను కార్యకర్తలను హింసిస్తూ వారిని అరెస్టు చేసి నెలల పాటు జైల్లో పెడుతున్నారు ఇలా మీరు ఎంత హింసిస్తే అంత రాటు తేలుతాం కానీ భయపడేది లేదని తెలిపారు..
ఇక ముగ్గురు కలసి వస్తే మాకు 11 సీట్లు వచ్చాయి.. అది నాయకుల మహత్యమో, ఈవీయంల మహత్యామో తేలాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రాష్ట్రంలో బెల్టు షాపులు ప్రతి చోటా పెడుతున్నారు. ఇక రాష్ట్రంలో రేషన్ బియ్యం ఇప్పటికే అక్రమ రవాణా జరుగుతూనే ఉంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనీ ఈయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.