AP: ఆర్థిక లోటు పై బాబు సంచలన వ్యాఖ్యలు.. ఏం అర్థం కావడం లేదు.. చాలా కష్టంగా ఉంది?

AP: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా కూటమి నేతలు అలివి గాని హామీలను ప్రకటించారు. జగన్ ఇచ్చిన దానికంటే రెండింతలు సంక్షేమ పథకాలను అందిస్తాము అంటూ చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హామీలను ప్రకటించారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదంటూ సంక్షేమ పథకాల అమలుకు అడ్డుకట్ట వేస్తున్నారు.

ఇలా రాష్ట్రం మొత్తం అప్పులలో ఉందని సంక్షేమ పథకాలు అందించడం కష్టంగా ఉందని ఎన్నో సందర్భాలలో చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే తాజాగా ఈయన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక లోటు గురించి క్లారిటీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఇదివరకు పనిచేశాను అయితే ఇలాంటి పరిస్థితులలోనైనా ఎంతో చాకచక్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాను కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉందని తెలిపారు..

ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చూస్తే ఇబ్బందిగా ఉంది. ఇంత అనుభవం ఉన్న నాకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది అంటే.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు ఎటు వెళ్తుందో.. ఎలా చక్కదిద్దాలో కూడా అంతుపట్టడం లేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలను వైసిపి పూర్తిస్థాయిలో తప్పుపడుతుంది 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు చేసిన అప్పుల కంటే కూడా 2024 అప్పులు చాలా వరకు తక్కువగానే ఉన్నాయి కానీ ఈయన మాత్రం పథకాలను ఎగ్గొట్టడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మన ప్రభుత్వ హయాంలో ఎంత అప్పు ఉన్నది అనేది బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అసెంబ్లీలో వెల్లడించారు అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

కేవలం పథకాలను పక్కదారి పట్టించడం కోసమే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అప్పులు ఉన్నాయి అంటూ రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదారి పట్టిస్తున్నారనీ వైకాపా నేతలు కార్యకర్తలు, చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఒకవేళ మన రాష్ట్రంలో అప్పులు భారీగా ఉంటే అలివి గాని హామీలను ఇస్తే అమలు చేయలేమనే విషయం బాబుకు తెలియదా తెలిసి కూడా ఈ హామీలు ఎలా ఇచ్చారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.