ఇంట్లో పూజ తర్వాత హారతి ఇచ్చే సమయంలో ఈ నియమాలు పాటించడం తప్పనిసరి..?

Closeup,Of,An,Aarthi,Or,Aarti,At,An,Indian,Hindu

సాధారణంగా హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో వారి ఇష్ట దైవానికి పూజ చేసి పూజ అనంతరం హారతి ఇవ్వడం జరుగుతుంది ఇలా కర్పూర హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వార్తావరణం ఏర్పడుతుందని భావిస్తారు అలాగే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఈ విధంగా పూజ తర్వాత మనం ఇచ్చే కర్పూర హారతి సమయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.

మరి పూజ తర్వాత కర్పూర హారతి ఇచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి నియమాలను పాటించడం వల్ల శుభం కలుగుతుంది అనే విషయానికి వస్తే… ప్రతిరోజు ఇంట్లో పూజ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు. అయితే హారతి ఇచ్చేముందు పూజా పళ్లెంలో పసుపు, కుంకుమతో స్వస్తిక్ వేసి అందులో పూలు సమర్పించిన తర్వాత పళ్లెంలో దీపం పెట్టి హారతి ఇవ్వాలి. అలాగే హారతి ఇచ్చేముందు ఇచ్చిన తరువాత శంఖాన్ని ఉదాలి. వీలైతే హారతి ఇచ్చే సమయంలో ఓం అక్షరం ఆకారంలో ప్లేటును తిప్పడానికి ప్రయత్నించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

హారతి ఇచ్చిన తర్వాత దేవుళ్ళ ముందు హారతి పల్లాన్ని దేవుళ్ళ పాదాల వైపు నాలుగు సార్లు, నాభి వైపు రెండుసార్లు, ఆ తర్వాత దేవుళ్ళ ముఖం వైపు ఒకసారి హారతి చూపించాలి. ఇలా ఏడుసార్లు తప్పనిసరిగా చేయాలి. అలాగే కొంతమంది మట్టి ప్రమిదలలో దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత తిరిగి ఆ దీపాలను మరుసటి రోజు హారతి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా దేవుడికి పూజ తర్వాత హారతి ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి.