Shivaji: పోసాని కృష్ణా మురళీరెడ్డి అని పేరు పెట్టుకో సరిపోద్ది.. పోసానికి కౌంటర్ ఇచ్చిన శివాజీ?

Shivaji: సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు రాజకీయాలలోకి కూడా అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో ఇమడలేక తిరిగి ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు. ఇకపోతే ఇటీవల వైకాపా పార్టీ నుంచి ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు తప్పుకున్న సంగతి మనకు తెలిసిందే.

గత ఐదు సంవత్సరాల కాలంలో వైకాపా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పలువురు సినీ సెలెబ్రిటీలు ఈ పార్టీలో కొనసాగుతూ ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు పై అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సినిమా సెలబ్రిటీ లందరూ కూడా వైకాపా పార్టీకి గుడ్ బై చెబుతూ బయటకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే నటుడు శివాజీ వైకాపా పార్టీకి చెందిన పోసాని కృష్ణమురళి వర్మ వంటి వారిని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పోసాని గతంలో అధికార మదంతో ప్రతిపక్షాల గురించి చేసిన అభ్యంతరకర అసభ్యకర వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోసాని గారు మీరు మంచి నటులు ఎందుకండీ మీరు కులం మతం రాజకీయాల గురించి అనవసరమైన మాటలు మాట్లాడటం. చంద్రబాబు గురించి అసభ్యంగా మాట్లాడారు. కులం గురించి అంతగా బాధ వుంటే మీరు కూడా పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి.నాడులన్నిటినీ కూడదీసుకుని అంత కసిగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏదైనా తప్పు వుంటే నేరుగా మాట్లాడవచ్చు.

ఇక మనం సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళం కాబట్టి మన గురించి ప్రజలు కచ్చితంగా మాట్లాడుకుంటారు. అయినా మన గురించి ఏం చెప్పకుంటారు వాడు మంచివాడైతే మంచివాడు లేదా చెడ్డవాడైతే చెడ్డవారని చెప్పుకుంటారు.. ఇకపోతే మీకు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అంత కక్ష అసలు చంద్రబాబు నాయుడు, అమరావతి రాజధాని గురించి మీకు ఎందుకు అంత కసి నాకు అర్థం కావడంలేదు. మీరే కాదు చాలామంది ఇలా విషం వెళ్లగక్కారు. ఇప్పుడు వారిలో కొందరు వెనక్కి వెళ్లిపోతున్నారు అంటూ శివాజీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.