అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్ దేవరకొండ.. కావాలనే హింట్ ఇస్తున్నారా?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎప్పటినుంచో రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరూ చాలాసార్లు అవి రూమర్స్ అని మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తూ వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు కలుస్తూ సోషల్ మీడియా కంట పడుతూ ఉంటారు. తాజాగా ఈ జంట ఓ హోటల్లో కనిపించారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

వీరు కావాలనే మీడియా కంటపడి వాళ్ల రిలేషన్ గురించి హింట్ ఇస్తారా అనేది కూడా అర్థం కాదు. ఒకసారి ముంబై ఎయిర్ పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడం, ఆ వెంటనే ఓకే మాల్దీవుల్లో విజయ్, రష్మిక వేర్వేరుగా దర్శనం ఇవ్వటంతో వీళ్ళిద్దరూ వాళ్ళ రిలేషన్ గురించి ఇన్ డైరెక్ట్ గా మీడియాకి హింటిస్తున్నట్లే అనిపిస్తుంది. ఆ తర్వాత మరొకసారి విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ వేరువేరుగా ఒకే ఇంట్లో ఉన్న ఫోటోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

విజయ్ దేవరకొండ ఫోటో దిగిన బ్యాగ్రౌండ్ లోనే రష్మిక కూడా ఫోటో దిగింది. బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న పిట్టగోడ రెండూ ఫోటోల్లోని సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్టు నిర్ధారించుకున్నారు మీడియా వాళ్ళు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమాతో మొదటిసారి కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.

ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాతో మరొకసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వర్క్ అవుట్ అయింది. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. ఇక అప్పటినుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా వాటిపై ఈ జంట ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తుందో చూడాలి.