Nagachaitanya-Shobitha: త్వరలో అక్కినేని ఇంకా పెళ్లి భాజాలు మోగనున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలను రెండవ పెళ్లి చేసుకోబోతున్నారు. గతంలో హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శోబితను రెండవ పెళ్లి చేసుకోబోతున్నారు. డిసెంబర్ 4న ఈ జంట వివాహం జరగనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతున్నాయి. ఇక మొన్నటికీ మొన్న శోభిత దూళిపాల పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టినట్లు ఫోటోలు షేర్ చేస్తూ తెలిపిన విషయం తెలిసిందే.
అయితే వీరి పెళ్లి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్డూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్నే పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. అయితే ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్ గానే చేయాలని నాగ చైతన్య కోరినట్లు నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులు వారిద్దరే చూసుకుంటున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్య,శోభిత పెళ్లి జరగడానికి అదే సెంటిమెంట్ గా తెలుస్తోంది. అక్కడే తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉండడమే కారణమట. ఈ పెళ్లికి ఆయన ఆశీర్వాదాలు కూడా ఉండాలని ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయమని నాగచైతన్య తాజాగా తెలిపారు.
అందుకే తన తాత అక్కినేని నాగేశ్వర రావు విగ్రహం ముందు వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చైతన్య వెల్లడించారు. మా కుటుంబాలు ఒకచోట చేరి ఈ వేడుక జరుపుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని వివరించారు. శోభితతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నట్లు కూడా చైతన్య చెప్పుకొచ్చారు. ఇకపోతే నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య ప్రస్తుతం చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇందులో నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నారు.