ఆర్ సి 16 కోసం మైసూర్ కి చేరుకున్న రామ్ చరణ్.. మట్టి లాంటి సినిమా అంటూ కితాబు!

రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని బుచ్చిబాబు డైరెక్షన్ లో తాను హీరోగా నటిస్తున్న ఆర్ సి 16 ( వర్కింగ్ టైటిల్ ) సినిమా కోసం రంగంలోకి దిగాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో పీరియాడికల్ వాతావరణం లో లాజికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కర్ణాటకలోని మైసూరులో ప్రారంభించారు. అక్కడ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్క్రిప్ట్ ని అమ్మవారి చెంత ఉంచి షూటింగ్ మొదలుపెట్టారు. అక్కడ 15 రోజులపాటు షూటింగ్ నిరంతరాయంగా సాగుతుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ షూటింగ్లో పాల్గొనడం కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి మైసూర్ బయలుదేరారు. మాల ధారణలో ఉన్న చరణ్ ఎయిర్పోట్ లో మాస్క్ ధరించి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో జరగబోతుందని సమాచారం. మొదటి షెడ్యూల్లో రాంచరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా పాల్గొనబోతున్నారు. మైసూర్ లోని కొన్ని పురాతన భవనాలు, మైసూరు శివార్లలోని అటవీ ప్రాంతాల్లో రామ్ చరణ్ సినిమా చిత్రీకరణ జరపబోతున్నారు.

ఈ సినిమా మట్టి లాంటి కథ అని ఇప్పటివరకు చేసిన చిత్రాలలో ఈ చిత్రం ది బెస్ట్ అవుతుందని ఒక వేదిక మీద రామ్ చరణ్ చెప్పడంతో ఈ సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకొని నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సానా బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, పూర్తిస్థాయి కథతో పకడ్బందీగా తీసుకువెళుతున్నారు. ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.