Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పేరు కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఈయన పాన్ ఇండియా పాలిటిక్స్ లో కూడా సంచలనంగా మారారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మాత్రం జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. పవన్ కళ్యాణ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయ్యారు.
ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో భాగంగా ఈయన ప్రచార కార్యక్రమాలకు వెళ్లారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ఐదు నియోజకవర్గాలలో కూడా కూటమి నేతలు భారీ మెజారిటీతో గెలిచారు. పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో కూటమి గెలుపుకు కారణమని ఈయన పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు అంత సీన్ లేదంటూ బన్నీ ఫాన్స్ గాలి తీస్తున్నారు.
పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ కు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉందనే వాదనని బన్నీ అభిమానులు తోసుకొచ్చారు. ఈయన కూటమిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు తప్ప సొంతంగా పోటీ చేస్తే గెలవలేరని తెలిపారు. ఇక మహారాష్ట్రలో కూడా కూటమికి మంచిపట్టు ఉన్న నేపథ్యంలో కూటమి నేతలు గెలిచారని బన్నీ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఒకవేళ ఈయనకు జాతీయస్థాయిలో రాజకీయాల పరంగా మంచి గుర్తింపు కనుక ఉంటే ఈయన తెలంగాణలో కూడా గత ఎన్నికలలో బిజెపికి మద్దతు తెలుపుతూ ప్రచారం చేశారు. మరి ఎందుకు తెలంగాణలో గెలవలేకపోయారు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇలా తెలంగాణలో కేవలం ఒక్క స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ గెలవలేదంటూ లాజికల్ ప్రశ్నలతో బన్నీ ఫ్యాన్స్ గాలి తీసేస్తున్నారు. మరి ఇది కూడా ఒకింత నిజమే అని చెప్పాలి. అక్కడ ఫుల్ క్రెడిట్ తీసేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్.. తెలంగాణలో ఎందుకు గెలవలేదు అంటే మాత్రం దానికి పవన్ అభిమానుల వద్ద మాత్రం సమాధానం లేదని చెప్పాలి. ఇక ఈ విషయంపై ఇద్దరి హీరోల అభిమానుల మధ్య మరోసారి చర్చలు జరుగుతున్నాయి.