ఆరోగ్య కారణాలు వలన చాలాకాలం కెరియర్ లో గ్యాప్ తీసుకున్న సమంత ఇప్పుడు మళ్ళీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా మారుతుంది. ఈ మధ్యనే సిటాడల్ హనీ- బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఆ సీరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి వచ్చింది.
ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సీరీస్ లో వరుణ్ ధావన్, సమంతల యాక్టింగ్ కి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. పోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్, సమంత ఇద్దరూ చిట్ చాట్ లో పాల్గొన్నారు . స్పైసీ రాపిడ్ ఫెయిర్ ఆడారు. ఇందులో అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేనికోసం ఖర్చు పెట్టారు అని వరుణ్ ధావన్ సమంతని ప్రయత్నించగా తన మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలకని తెలిపింది సమంత.
వాటి కాస్ట్ ఎంత ఉంటుంది అని వరుణ్ మళ్లీ ప్రశ్నించగా కాస్త ఎక్కువే అని చెప్పిన సమంత ఇక నెక్స్ట్ మాట్లాడుకుందామా అని ఆ టాపిక్ ని అక్కడితో కట్ చేసేసింది. అయితే సమంత ఎవరికోసం అలా అన్నారో అని నెటిజన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. కొందరు తన మాజీ భర్త నాగచైతన్య గురించే ఆమె అలా మాట్లాడింది అని అంటే కొందరు మాత్రం నాగచైతన్య కన్నా ముందు ఆమె హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉంది.
వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకునే లోపే వారి మధ్యన బ్రేకప్ అవ్వటం ఆ తర్వాత సమంత నాగచైతన్య ప్రేమలో పడి పెళ్లి పీటలు ఎక్కటం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా ఇప్పుడు సమంతా చేసిన ఈ కామెంట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. నాగచైతన్య రెండో పెళ్ళికి రెడీ అవుతున్న సమయంలో ఇలాంటి టాపిక్ అవసరమా అని సమంతని కొంతమంది విమర్శిస్తున్నారు.
“My EX’s Expensive Gifts.”#Samantha with #VarunDhawan during #CitadelHoneyBunny promotions.
vc @PrimeVideoIN pic.twitter.com/v9ossd274G
— Gulte (@GulteOfficial) November 24, 2024