Abhishek Bachchan: నెగిటివిటీపై స్పందించిన అభిషేక్ బచ్చన్.. దూరం వెళ్లిపోతే అంటూ!

Abhishek Bachchan: బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ గురించి మనందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు అభిషేక్ బచ్చన్. అందులో భాగంగానే తాను తాజాగా నటించిన ఐ వాంట్ టు టాక్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అభిషేక్ బచ్చన్. ఆ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న నెగెటివిటీ గురించి స్పందించారు.

ఈ మేరకు అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. హిందీలో ఒక సూక్తి ఉంటుంది. విషయం ఏదైనా సరే.. నువ్వు ఆచరించేది మంచి అయినప్పడు దానిని ఎప్పటికీ వదలకూడదు. ప్రాథమిక విలువలు మార్చుకోకూడదు. అన్నింటి నుంచి అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలి. ఇదే నేను నమ్ముతాను. నెగటివిటీని చూసి మారను. నేను ఎప్పుడూ పాజిటివ్‌ గానే ఉండాలనుకుంటాను. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటివి సర్వసాధారణం. సమస్య ఎంత పెద్దది అయినా, ఆశతో ముందుకు అడుగువేయాలి.

అలా కాకుండా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి దూరం వెళ్లిపోతే అది తప్పు అంటారు అని చెప్పుకొచ్చారు అభిషేక్ బచ్చన్. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమితాబ్ బచ్చన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు మెచ్చుకుంటూ చాలా బాగా చెప్పారు అంటూ కామెంట్ చేస్తున్నారు.