Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. అలాగే హిందీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హిందీలో ఒకసారి నవ్వుతున్న బిగ్ బాస్ 18వ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సల్మాన్ ఖాన్. అందులో భాగంగానే తాజాగా వీకెండ్ కా వార్ ఎపిసోడ్ లో పాల్గొన్నారు.
రజత్ అనే కంటెస్టెంట్ ప్రవర్తన తప్పని వారించాడు. ఎవరైనా ఉన్నప్పుడు టేబుల్‌పై దర్జాగా కాలుపెట్టి మాట్లాడటం తప్పని, ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలని హితవు పలికాడు. నేను కూడా ఒకప్పుడు రూడ్ గా ఉండేవాడిని అని తెలిపారు సల్మాన్ ఖాన్. ఈ విషయం గురించి చెబుతూ ఒక ఉదాహరణ కూడా చెప్పుకొచ్చాడు. టేబుల్ కు కాళ్లు అనించే అలవాటు నాకు కూడా ఉంది. గతంలో ఒక పోలీస్ స్టేషన్ లో కాళ్లు టేబుల్ కు ఆనించి కూర్చున్నాను. నేను ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అన్నట్లుండేది నా వాలకం. కానీ ఎవరైనా సీనియర్ అధికారులు బ్యాడ్జ్ ధరించి వచ్చినప్పుడు లేచి గౌరవించాలి.
ఆ పాత క్లిప్పింగ్స్ చూసినప్పుడు నేనేమీ గర్వంగా ఫీలవను. అంత పొగరుగా కూర్చోవాల్సిన అవసరమేముంది? అనుకునేవాడిని. పోలీసులను అగౌరవపర్చేలా అంత అహంకారంగా ఎందుకు ప్రవర్తించాననుకున్నాను. ఎంత అనుకున్నా.. దాన్నిప్పుడు మార్చలేను కదా! ఇప్పుడు నీపై కూడా అంతే రూడ్‌గా మాట్లాడొచ్చు. నీ కంటే నా గొంతు పెద్దది. కానీ నేనలా గొంతు పెంచి అరవాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చారు సల్మాన్. అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.