35% షూటింగ్ పూర్తయింది.. కల్కి పార్ట్ 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు!

నాగ్ అస్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పడుకొనే తదితరులు నటించిన కల్కి 2898 ఏడి పార్ట్ 2 సినిమా షూటింగ్ 35% పూర్తి చేసామని చెప్పారు సినిమా నిర్మాతలు అయిన స్వప్న దత్,ప్రియాంక దత్. కల్కి టు 2898 ఏడి సినిమా పార్ట్ 1 సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే పార్ట్ 2 కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేశామని చెప్పారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అవి పూర్తయిన తర్వాత కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుంచి అనేది స్పష్టత ఇస్తామని చెప్పుకొచ్చారు. కల్కి పార్ట్ వన్ క్లైమాక్స్ సన్నివేశంలో ప్రభాస్ గత జన్మలో కర్ణుడిగా చూశారు, కల్కి అసలు కధ రెండో భాగంలోనే ఉంటుందని, మొదటి భాగంలో సుప్రీం యాస్కిన్ గా కొద్దిసేపు మాత్రమే కనిపించిన కమల్ హాసన్ రెండో భాగంలో కీలక పాత్రలో చాలాసేపు కనిపిస్తారని చెప్పారు. పార్ట్ 2 కోసం తాము ఉత్సాహంగా ఉన్నామని ఈసారి చాలా ఎక్సైటింగ్ గా ఉందని,సినిమా కోసం ఇప్పుడు చాలా ఎక్కువ ప్లానింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.

గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలలో పాల్గొన్న స్వప్న, ప్రియాంక దత్ లని కల్కి పార్ట్ 2 సినిమా గురించి విలేకరులు ప్రశ్నించగా పై సమాధానాలు ఇచ్చారు సదరు నిర్మాతలు. అంతేకాకుండా ఒక తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆదరణ లభించడం చూస్తే మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉందని కూడా చెప్పారు. మొదటి భాగానికి వచ్చిన అపూర్వ స్పందన, కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కల్కి పార్ట్ 2 సినిమాని మరింత భారీగా అద్భుతంగా తీయబోతున్నట్లు చెప్పారు.

వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీత నిర్మించిన కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియన్స్ ని భిన్నమైన ప్రపంచంలోకి తీసుకువెళ్లి మంత్రముగ్ధులని చేసింది. సీక్వెల్ లో అసలు పరిణామాలు మొదలవుతాయని నిర్మాతలు చెప్పటంతో ప్రేక్షకులకు పార్ట్ 2 సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.