దేవుడిని పూజించే సమయంలో వాడకూడదని పువ్వులివే.. ఈ పూల వల్ల ఇంత నష్టమా?

హిందువులు భగవంతుడిని పూజించడానికి పువ్వులను వినియోగిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూలు లేకుండా దేవుడిని పూజించడం అస్సలు జరగదనే సంగతి తెలిసిందే. పూలతో దేవుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు సులువుగానే నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే కొంతమంది దేవుళ్లకు కొన్ని రకాల పూలను సమర్పించడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది.

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో శివుడు ఒకరు కాగా శివుడిని క్యాడీ పువ్వులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించకూడదు శివుడికి ఈ పూలను సమర్పిస్తే చెడు ఫలితాలు కలుగుతాయి. శ్రీ విష్ణువును పూజించే భక్తులు ఈ దేవునికి అగస్త్యపుష్పం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు. ఇలాంటి పూలతో దేవుడిని పూజిస్తే చెడు ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

శ్రీరాముడిని పూజించే భక్తులు పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంట పూలను సమర్పించడం మంచిది కాదు. ఈ పూలను సమర్పించడం వల్ల శ్రీరాముడికి కోపం వస్తుందని శాస్త్రాలలో పేర్కొన్నారు. సూర్య దేవుడిని పూజించే భక్తులు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను సమర్పించడం మంచిది కాదు. పార్వతీ దేవిని పూజించే భక్తులు పటిక పూలను సమర్పించకూడదు.

ఈ పూలను పార్వతీ దేవికి సమర్పించడం వల్ల నెగిటివ్ ఫలితాలు కలుగుతాయి. దేవుడిని పూజించే భక్తులు భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించడం వల్ల నెగిటివ్ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. గుడిలో ఉన్న సమయంలో మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలను రానీయకూడదు. దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.