వినాయక చవితి పూజా విధానం వివరాలివే.. విఘ్నేశ్వరుడిని ఎలా పూజించాలంటే?

హిందువులు గ్రాండ్ గా జరుపుకొనే పండుగలలో వినాయక చవితి ఒకటి కాగా వినాయకుడిని పూజిస్తే ఎలాంటి కష్టాలు అయినా తీరతాయని చాలామంది భావిస్తారు. ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టే ముందు వినాయకుడిని పూజిస్తూ మొదలుపెడితే శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వినాయకుని అనుగ్రహం మనపై ఉంటే మొదలుపెట్టిన పనిలో కచ్చితంగా విజయం దక్కుతుంది.

సాధారణంగా బాధ్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటామనే సంగతి తెలిసిందే. : హిందూ సాంప్రదాయంలో ఏ శుభ కార్యం మొదలెట్టినా ముందు గణనాధుని పూజించిన తర్వాత మాత్రమే ఇతర పనులను మొదలుపెడతారు. భారతీయులు చేసుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి కావడం గమనార్హం. ఈ పండుగ రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని అభ్యంగన స్నానమాచరించి మంచి వస్త్రాలను ధరించాలి.

పూజకు అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకుని పూజకు ఉపక్రమిస్తే మంచిది. పసుపు విఘేశ్వరుని పూజ చేసి పూజా కార్యక్రమాన్ని మొదలు పెడితే మంచిది. వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేయాలని శాస్త్రాలు చెబుతుండటం గమనార్హం. వినాయక చవితి పండుగ రోజున 21 పత్రాలతో పూజ చేస్తే మంచిది. వినాయక చవితి కథలను చదవడం ద్వారా కూడా దేవుని అనుగ్రహం కలిగే ఛాన్స్ ఉంటుంది.

వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. మట్టి వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే పర్యావరణానికి మంచిది. విఘ్నేశ్వరునికి ఇష్టమైన వంటకాలను చేసి పూజిస్తే మంచిదని చెప్పవచ్చు. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో విగ్రహాన్ని ప్రతిష్టించాలి. వినాయకుని విగ్రహానికి క్రమం తప్పకుండా పూలు, నీటిని సమర్పిస్తే దేవుని అనుగ్రహం కలుగుతుంది.