దేవుడికి పూజ చేసే సమయంలో చేయకూడని తప్పులు ఇవే.. ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవా?

మనలో చాలామంది దేవుడిని ఎంతో భక్తితో పూజిస్తారనే సంగతి తెలిసిందే. దేవుడిని పూజించే సమయంలో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. అయితే దేవుడిని పూజించే వాళ్లు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల దేవుడిని కోరుకున్న కోరికలు నెరవేరకుండా ఉండటంతో పాటు కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దేవుడిని పూజించే సమయంలో పూజగదిని శుభ్రంగా ఉంచుకోవాలి.

నైవేద్యం చాలా శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వంటగదిని పూర్తిగా శుభ్రం చేసి అభ్యంగన స్నానం చేసి దేవుడిని పూజించాలి. బంగారం, వెండి, రాగి లేదా ఇత్తడితో తయారు చేసిన పాత్రలో దేవుడికి నైవేద్యాన్ని సిద్ధం చేయాలి. దేవుడికి సమర్పించిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు, ఇతరులకు పంచాలి.

మంత్రాన్ని పఠిస్తూ ప్రసాదం సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. దేవుడికి ప్రసాదాన్ని సమర్పించే సమయంలో ప్రసాదం పొరపాటున కూడా నేలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుడిని పూజించే సమయంలో ఇతర ఆలోచనలు ఉండకూడదు. దేవుడిని పూజించే సమయంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి.

దేవుడిని పూజించే సమయంలో ఆరోజు పండుగను పట్టి పూజగదిని అలంకరించడంతో పాటు చేసే ప్రసాదాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. దేవుడిని పూజించే వాళ్లకు కచ్చితంగా పుణ్య ఫలం దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.