రామ్ చరణ్ ని తెగ పొగిడేసిన రోజా.. సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ప్లాన్!

సినీనటి మాజీ మంత్రి అయిన రోజా చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూలకి, మీడియా కి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ పబ్లిక్ లోకి వస్తున్నారు. తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె అనేక విషయాలని షేర్ చేసుకుంది. మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నారా అని యాంకర్ ప్రశ్నించగా ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నట్లు రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పింది రోజా. అయితే హుందాగా, పవర్ ఫుల్ గా ఉండే పాత్రలు, పవర్ఫుల్ పాత్రలు చేయాలని ఉందంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది.

బాహుబలి లో రమ్యకృష్ణ, సరిలేరు నీకెవ్వరు లో విజయశాంతి, అత్తారింటికి దారేదిలో నదియా చేసిన స్ట్రాంగ్ రోల్స్ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. తన నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూనే సినిమాలు కూడా చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇక ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలను చర్చిస్తూ రామ్ చరణ్ టాపిక్ వచ్చింది. అప్పుడు రోజా రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చిన్నప్పుడు రామ్ చరణ్ ని ఎత్తుకొని పెంచాను, ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో ఊటీకి వచ్చాడు. అప్పుడు చాలా అల్లరి చేసేవాడు, స్కూల్లో జాయిన్ అయ్యాక అల్లరి తగ్గింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా చూశాక చాలా గర్వంగా అనిపించింది. ఓపెనింగ్ షాట్ లో చరణ్ దూకి అందర్నీ కొట్టి వచ్చే సీన్ భలే అనిపించింది, అతని డాన్స్ లో వాళ్ళ నాన్న కనిపిస్తాడు, చిన్నప్పటి నుంచి చరణ్ వాళ్ళ నాన్న పాటలకు డాన్స్ చేస్తూ ఉండేవాడు అంటూ రాంచరణ్ ని తెగ పొగిడేసింది.

బేసిగ్గా రోజా చిరంజీవి కి పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే. రాజకీయాల పరంగా ఇద్దరికీ ఎంతో దూరం ఉన్నప్పటికీ నటనపరంగా రోజా కి చిరంజీవి అంటే అభిమానమే. అయితే రామ్ చరణ్ మాత్రం రోజా మీద పీకల్లోతు కోపంలో ఉన్నట్లు, ఆమె ఉంటే ఆ సినిమా చెయ్యను అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు రోజా కామెంట్స్ వింటే రాంచరణ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.