హిందువులలో చాలామంది శ్రీ కృష్ణుడిని భక్తితో పూజిస్తారనే సంగతి తెలిసిందే. విష్ణువు యొక్క 8వ అవతారం శ్రీ కృష్ణుడు కాగా కృష్ణుడిని పూజించడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ అయితే పొందవచ్చు. కృష్ణుడిని పూజించే భక్తులు కొన్ని విషయాలను మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తం సమయంలో కృష్ణుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
గంగా జలంతో స్నానం చేసి అరచేతిలో నీళ్లు పెట్టుకుని శ్రీ కృష్ణుని మంత్రాన్ని జపించడం వల్ల శ్రీ కృష్ణుడి ఆశీర్వాదం మనపై ఉంటుందని చెప్పవచ్చు. తులసి ఆకులతో శ్రీ కృష్ణుడిని పూజించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కృష్ణుడిని అలంకరించి కృష్ణుడి ముందు అద్దం పట్టుకోవడం ద్వారా కూడా మంచి జరుగుతుందని చాలామంది భావిస్తారు.
శ్రీ కృష్ణునికి హారతి ఇవ్వడం ద్వారా ఆనందం, శ్రేయస్సుతో పాటు సంపదను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. పసుపు రంగు దుస్తులు ధరించి శ్రీ కృష్ణుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. శ్రీ కృష్ణుడిని పూజించే భక్తులు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కృష్ణుడిని పూజించడం ద్వారా మనస్సు సైతం ప్రశాంతంగా ఉంటుందని చాలామంది భక్తులు భావిస్తారు.
బ్రహ్మ మూహుర్తంలో చేసే పనుల వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుందని చాలామంది భావిస్తారు. బ్రహ్మ మూహూర్తంలో నిద్ర లేవడం వల్ల మనస్సు సైతం ప్రశాంతంగా ఉండటంతో పాటు కోరుకున్న లక్ష్యాలను సులువుగా సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.