Pawan Kalyan: సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పవన్ పోటీ చేసిన ప్రాంతాలలో కూటమి నేతలు భారీ మెజారిటీతో గెలవడంతో ఈ మెజారిటీ వెనక పవన్ హస్తం ఉందని పలువురు అభిమానులు రాజకీయ నాయకులు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ఎగ్జిట్ పోల్ సర్వే సమస్థ అయినటువంటి కేకే సర్వే కిరణ్ కొండేటి ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కిరణ్ కొండేటి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. బల్లార్‌పూర్, చంద్రాపూర్, పుణె కంటోన్మెంట్, హడ్సర్‌పూర్, కస్బాపేట్, డెగ్లూర్, లాతూర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు.
పవన్ ప్రచారం చేసిన చోట కూటమి నేతలు భారీ మెజారిటీతో గెలిచారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో కచ్చితంగా పవన్ ప్రభావం చూపించిందని కిరణ్ తెలియజేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తెలుగు వారు ఎక్కడైతే ఎక్కువగా నివసిస్తున్నారో ఆయన ఆ నియోజకవర్గాలలో పర్యటన చేశారని తెలిపారు.
పవన్ కల్యాణ్ ప్రచారం వల్ల బీజేపీకి ఒకటి, రెండు శాతం ఓటింగ్ పెరిగి ఉండొచ్చని అంచనా వేశారు. బీజేపీకి ఇన్నాళ్లకు బలమైన, ప్రజా ఆకర్షణ ఉన్న పవన్ కల్యాణ్ దొరికాడని తెలిపారు. భవిష్యత్ లో బీజేపీకి పవన్ కల్యాణ్ బలమైన మిత్రుడిగా ఎదిగే అవకాశం ఉందని అంచనా వేశారు. కాగా కేకే సర్వే సమస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలకు చాలా దగ్గరగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ఇక ఈయన ఇటీవల ఏపీ ఎన్నికలలో కూడా చెప్పిన సర్వే ప్రకారమే ఫలితాలు రావడంతో కేకే సర్వే సంస్థ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది.