Nara Lokesh: జగన్ పై లోకేష్ సంచలన ట్వీట్.. విద్యా వ్యవస్థను నాశనం చేశారంటూ?

Nara Lokesh: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆరు ప్రశ్నలు వేశారు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అలాగే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అలాగే అమ్మ ఒడి పథకం గురించి కూడా ఈయన ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రశ్నలు వేశారు ఈ క్రమంలోనే నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా జగన్ గురించి లోకేష్ మాట్లాడుతూ..చిన్న పిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పుని తాను సుద్దపూసని అనడం విచిత్రంగా ఉందని సెటైర్లు వేశారు. గుడ్లు పిల్లలు తినే చిక్కి ఫీజు రియంబర్స్మెంట్ అన్ని మొదలుకొని మీరు నాపై వేసినటువంటి భారం అక్షరాలా రూ. 6,500 కోట్లు జగన్ అని అన్నారు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన మీది అని ఫైర్ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల జీవితాలతో ఫుట్బాల్ ఆడుకున్నారని జగన్ పై మండిపడ్డారు.

జగన్ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది సుప్పిని జగన్. విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో రూ.3500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు ఎటు కాకుండా పోయింది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తక్షణమే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయాలని గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన డబ్బులను విడుదలవారీగా అందచేస్తామని ఆదేశాలను జారీచేసాము.

ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తల్లుల అకౌంట్లో వేయటం వల్ల ఎంతోమంది ఆ డబ్బును కళాశాలలకు చెల్లించలేకపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ పథకం కింద విద్యార్థులను భారీగా మోసం చేయడంతో సర్టిఫికెట్లు లేక ఈ విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా కళాశాల యాజమాన్యంకే చెల్లించేలా చర్యలు తీసుకున్నట్లు లోకేష్ తెలిపారు. గత ఐదు సంవత్సరాల కాలంలో విద్యాసంస్థను జగన్ పూర్తిగా నాశనం చేశారు. ఏకంగా నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తప్పుకున్నారని లోకేష్ మండిపడ్డారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలలలో కనీస అవసరాలు కూడా లేవని ఈయన జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు.