Bandla Ganesh: ప్రాణం పోయిన బిఆర్ఎస్ పార్టీ గురించి ఆ పని అస్సలు చేయను: బండ్ల గణేష్

Bandla Ganesh: సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన నిర్మాతగా మారిన తర్వాత సినిమాలలో పెద్దగా నటించలేదని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో బండ్ల గణేష్ సినిమాలను కూడా చేయకుండా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు.

ఇకపోతే బండ్ల గణేష్ కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. ఇప్పటికీ కూడా తాను కాంగ్రెస్ పార్టీని అని ఈయన బల్లగుద్ది మరి చెబుతున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రేవంత్ రెడ్డి మిడిల్ క్లాస్ సీఎం అని ఆయన ఎవరినైనా కలుస్తారు ఆయనతో ఎవరైనా కలవచ్చు. రేవంత్ రెడ్డి ఈ 29 రాష్ట్రాలలోనే బెస్ట్ సీఎం అంటూ ఆయన పై ప్రశంశల వర్షం కురిపించారు. తాజాగా మరోసారి ఈయన కాంగ్రెస్ పార్టీ గురించి అలాగే బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాను 2000 సంవత్సరం నుంచి రాజకీయాలకు దగ్గరయ్యాను అప్పటినుంచి ఇప్పటివరకు నా పార్టీ ఏది అంటే నేను కాంగ్రెస్ అనే చెబుతాను నాకెంతో ఇష్టమైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు అలాగే నా దైవం అయినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఆ పార్టీలోకి వెళ్లలేదని బండ్ల గణేష్ తెలిపారు.

ఇలా నేనెప్పుడూ పార్టీలు మారి ఇతర పార్టీలకు భజన చేయలేదని తెలిపారు. ఇక గత పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి తాను ఎప్పుడూ కూడా వ్యతిరేకమైనని నా ప్రాణం పోయే పని వచ్చిన బిఆర్ఎస్ గురించి ఎక్కడ గొప్పగా చెప్పనని నా పార్టీ కాంగ్రెస్ అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.