RGV: గత ప్రభుత్వ హయాంలో కూటమి నేతల గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతూ అనుచిత పోస్టులు చేశారో అలాంటి వారి పట్ల కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమందిని ఇప్పటికే అరెస్టులు కూడా చేశారు ఈ క్రమంలోనే వైకాపా ప్రభుత్వ హయామంలో రాంగోపాల్ వర్మ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు చేశారు.
ముఖ్యంగా ఈయన వ్యూహం సినిమా విడుదలకు ముందు రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం పట్ల ఈయనపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే విచారణకు రావాలని పోలీసులు చెప్పిన ఈయన మాత్రం సినిమా పనులలో బిజీగా ఉండటం వల్ల విచారణకు రాలేను అని తనకు కాస్త గడువు కావాలని తెలిపారు.
మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ కోర్టులో పిటీషన్ కూడా వేయడంతో కోర్ట్ ఆ పిటీషన్ ని తోసి పుచ్చింది. దీంతో వర్మ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేస్తోంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మను ఏ క్షణమైన అరెస్టు చేయొచ్చు అని తెలుస్తుంది. ఇలా పోలీసులు తనని కనుక అరెస్టు చేస్తే తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని ఈయన బెయిల్ పిటీషన్ లో పేర్కొన్నారు.
ఇలా అరెస్టు భయంతోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.విచారణకు సహకరించకపోతే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆర్జీవీ అసలు ఇంట్లోనే లేరన్న విషయం తెలిసింది. ఎక్కడికెళ్లారన్న విషయం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అరెస్టు భయంతోనే ఈయన పారిపోయారని ప్రస్తుతం పరారీలో ఉన్నారంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు.