రావి చెట్టు ఆకుపై ప్రమిద వెలిగిస్తున్నారా… ఈ దోషాలు తొలగిపోయినట్టే!

peepal-tree

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని ఆచార వ్యవహారాలను ఎంతో పద్ధతిగా పాటిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే చాలామంది రావి చెట్టును సకల దేవతల స్వరూపమని భావిస్తుంటారు. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని భావిస్తారో అందుకే రావి చెట్టుకు పూజ చేయడం వల్ల ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు అయితే రావి చెట్టు ఆకుపై ప్రమిదను వెలిగించడం వల్ల కూడా దోషాలనుంచే విముక్తి పొందవచ్చు. ఇంట్లో రావిచెట్టు ఆకులను వుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష,కర్మ ఫలితాలు వుండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి.

రావి చెట్టు ఆకులను తీసుకువచ్చి దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహు – కేతుదోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.ఇక రావి చెట్టు ఆకుపై దీపం వెలిగించేటప్పుడు ఆకుకు ఉన్నటువంటి కాడ ఎప్పుడు కూడా దేవుడి వైపు ఉండాలి. ఆకు చివరి భాగం ఎప్పుడు మనల్ని చూసే విధంగా పెట్టి దీపం వెలిగించాలి.

దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి, శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇక శుక్రవారం లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి పూజించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఈ విధంగా నువ్వుల నూనెతో రావి ఆకుపై దీపం వెలిగించడం వల్ల శని గ్రహ దోషాల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.