కార్తీకమాసంలో శివుడిని ఇలా పూజిస్తే కోరికలు నెరవేరతాయట.. ఏం చేయాలంటే?

కార్తీకమాసం అత్యంత పవిత్రమైన మాసం కావడంతో పాటు మహిమాన్వితమైన మాసం అనే సంగతి తెలిసిందే. శివ, కేశవులకు ఈ నెల ప్రీతికరమైన నెల కాగా ఈ మాసంలో శివుడిని పూజించిన వాళ్లకు శివుని అనుగ్రహం లభించడంతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయి. నియమనిష్టలను పాటిస్తూ దేవుళ్లను పూజించడం ద్వారా మనం కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయి.

కార్తీక మాస నియమాలను పాటించేవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కార్తీక మాసంలో నదులలో దీపాలను వదిలి దేవుడిని పూజిస్తే మంచిదని చెప్పవచ్చు. ప్రతిరోజూ తెల్లవారుజామున చల్లనీళ్లతో స్నానం చేసి భక్తితో దేవుడిని పూజిస్తే మంచి కలుగుతుంది. కార్తీక మాసంలో దాన ధర్మాలకు పెద్ద పీట వేయాలి. కార్తీకమాసం సమయంలో మంచంపై పడుకోవడం కూడా చేయకూడదు.

ప్రతిరోజూ భక్తితో, విశ్వాసంతో నిత్య పూజాదికాలను నిర్వహించాల్సి ఉంటుంది. కార్తీకమాసంలో మాంసం తినడానికి వీలైనంత దూరంగా ఉండాలి. కార్తీక మాస నియమాలను పాటించే వాళ్లు రోజులో ఒకపూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది. శివానుగ్రహం పొందాలంటే శివుడి దగ్గర ఉసిరికాయ దీపం వెలిగిస్తే మంచిది. ఉసిరిచెట్టును హిందువులు శివుని స్వరూపంగా భావిస్తారు.

శివుడు, కేశవుడు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని మరి కొందరు భావిస్తారు. పత్తితో చేసిన వత్తులను నెయ్యిలో నానబెట్టి అరటిడొప్పల్లో వత్తులను ఉంచి వెలిగించాలి. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగించడం ద్వారా నరదిష్టి, నవగ్రహ దోషాలు కూడా పూజలు చేసేవాళ్లకు తొలగిపోయే అవకాశం ఉంటుంది.