హిందువులకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. కార్తీక పౌర్ణమిని త్రిపురి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. నవంబర్ నెల 27వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమిని జరుపుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుంటూ ఉండటం గమనార్హం.
భక్తులు శివునికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించడంతో పాటు పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలలో భక్తుల సందడి నెలకొనగా కొన్ని ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించి దీపారాధన చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలలో శివునికి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు రావిచెట్టుకు పూజ చేయడం ద్వారా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈరోజు ఇతరులకు సహాయం చేసినా, దానాలు చేసినా, ధ్యానం చేసినా అనుకూల ఫలితాలు వస్తాయి. ఉదయం 10 గంటల సమయంలో రావిచెట్టుకు పూజ, అర్చన చేయడం ద్వారా మంచి జరుగుతుంది. రావిచెట్టు చుట్టూ శుభ్రం చేసుకుని బియ్యంపిండితో చిన్నగా ముగ్గు వేసుకుని 8 వత్తుల దీపం వెలిగించి రావిచెట్టు కొమ్మకు ఎరుపు రంగు దారాన్ని 12సార్లు చుట్టడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి.
ఈరోజు రావిచెట్టుకు నీళ్లు పోసినా చేసిన పాపాలన్నీ తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. రావిచెట్టును పూజించడం ద్వారా ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. పెళ్లికాని వాళ్లు రావిచెట్టు దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. స్వామివారిని జిల్లేడు పూలతో పూజించడం ద్వారా కూడా దేవుని అనుగ్రహం మనపై ఉంటుందని చెప్పవచ్చు.