రావి చెట్టు విష్ణువు స్వరూపంగా భవిస్తారు. అందువల్ల హిందూ మతంలో రావి చెట్టు ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూజా కార్యక్రమాలను రావి చెట్టు కింద చేస్తారు. అంతేకాకుండా రావిచెట్టు వేప చెట్టు పక్కనే ఉంటే వాటికి పెళ్లిళ్లు కూడా చేస్తూ ఉంటారు. కాగా మత విశ్వాసాల ప్రకారం ప్రతి శనివారం రావి చెట్టు క్రింద ఆవాల నూనె దీపం వెలిగించడం జీవితంలో ఆనందం, శాంతిని కలిగిస్తుంది. అయితే రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతారు? అంతేకాదు రాత్రి పూట రావి చెట్టును తాకకూడదు.
మరి ఈ విషయంలో నిజా నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాత్రి సమయంలో రావి చెట్టు లేదా ఇతర చెట్ల కింద పడుకోవడం నిషేధం. ఎందుకంటే చెట్లు రాత్రిలో కార్బన్ డయాక్సైడ్‌ను గాలిలోకి విడుదల చేస్తాయి. మానవ శరీరానికి అది మంచిది కాదు, ఎక్కువ సమయం కార్బన్ డయాక్సైడ్ పీలిస్తే శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. అందుకే రాత్రి సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్లకూడదు. హిందూ మతంలో రావి చెట్టును దైవ స్వరూపంగా భావిస్తారు. విశ్వాసం ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రావి చెట్టులో నివసిస్తారు.
మహావిష్ణువు రావి చెట్టు మూలాలలో, కేశవుడు కాండం.. సకల దేవతలు ఆకులలో నివసిస్తున్నట్లు పురాణాలలో చెప్పబడింది. అందువల్ల రావి చెట్టును పూజిస్తారు. కనుక గ్రంధాల ప్రకారం రాత్రి సమయంలో రావి చెట్టు కిందకు వెళ్లడం లేదా నిద్రించడం శుభప్రదంగా పరిగణించబడదు. ఇకపోతే రావి చెట్టును ఆత్మలు దుష్ట శక్తులు ఉంటాయా అన్న విషయానికి వస్తే.. రావి చెట్టుపై ఆత్మలు నివసిస్తాయనేది కేవలం ఊహాత్మకమైనవి. గ్రంథాలలో రావి చెట్టును దేవతల మొక్కగా పరిగణిస్తారు. కనుక ఈ చెట్టులో ఆత్మ నివసిస్తుందనేది మనుషులు రాత్రి ఈ చెట్టుకు దూరంగా ఉంచడానికి మాత్రమే అని శాస్త్రీయ కోణం.