మనలో చాలామంది ఎంత కష్టపడినా శుభ ఫలితాలను పొందే విషయంలో ఫెయిల్ అవుతుంటారు. గ్రహాల దోషాల వల్ల అనుకూల ఫలితాలు రాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నవగ్రహ దోషాలను తొలగించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఒక్కో గ్రహం వల్ల ఒక్కో దోషం ఉంటుందని చెప్పవచ్చు. నవగ్రహ దోషాలకు శాంతి పూజలు చేయిస్తే మంచిది. నవగ్రహాలను డైరెక్ట్ గా చేతితో తాకడం మంచిది కాదు.
సూర్య గ్రహ దోషంతో బాధ పడుతుంటే సూర్యుడిని పూజించడంతో పాటు కెంపును ధరిస్తే మంచిది. కంచుతో చేసిన ఉంగరం ధరించడం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. రాగి ఉంగరం ధరించడం ద్వారా అనుకూలంగా జరిగింది. సూర్యాయనమహః అనే మంత్రాన్ని జపించడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు. చంద్ర గ్రహ దోషం ఉంటే చంద్రుని పూజించడంతో పాటు బియ్యం దానం చేస్తే మంచిది.
సీసపు ఉంగరం, వెండి ఉంగరం ధరించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. కుజ గ్రహం దోషంతో బాధ పడుతుంటే మంగళవారం రోజున ఓం క్రాం క్రీం క్రౌం సః భౌమాయనమః అనే మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. బుధ గ్రహ దోష నివారణకు ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయనమః అనే మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.
గురు గ్రహ దోషంతో బాధ పడుతుంటే గురు గ్రహాన్ని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. బంగారం దానం చేయడం వల్ల ఈ దోషాలు దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వెండితో చేసిన ఉంగరం లేదా ముత్యంతో చేసిన ఉంగరం ధరిస్తే శుక్ర గ్రహ దోషం దూరమవుతుంది. శని గ్రహ దోష నివారణకు ఓం ఖ్రాం ఖ్రీం ఖ్రౌం సః శనయేనమః అనే మంత్రాన్ని పఠిస్తే మంచిది.