గర్భవతులు పూజ చేయకూడదని చెప్పడం వెనక అసలు రహస్యం ఏమిటో తెలుసా..?

మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రజలందరూ ప్రతిరోజు ఉదయం లేవగానే ఇంట్లో, దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ప్రతిరోజు ఇలా ఇంట్లో పూజలు చేయటం వల్ల శుభ ఫలితాలు ప్రజల నమ్మకం. సాధారణంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు పూజ చేస్తూ ఉంటారు. ఇంట్లో గర్భంతో ఉన్న మహిళలు మాత్రం పూజ చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు దేవాలయాలకు కూడా వెళ్లకూడదని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు పూజ చేయడం దేవాలయానికి వెళ్ళటం వల్ల ఎటువంటి పరిణామాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గర్భంతో ఉన్న మహిళలు దేవాలయాలకు వెళ్ళకూడదని మన పెద్దలు సూచిస్తూ ఉంటారు. ఇలా చెప్పటానికి శాస్త్రీయపరమైన కారణం కూడా ఉంది. గర్భిణీ స్త్రీలు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనసుతో విశ్రాంతి తీసుకోవాలి. కానీ దేవాలయాలలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అటువంటి సమయంలో గర్భిణీ స్త్రీలు దేవాలయాలకు వెళ్ళటం వల్ల ఎక్కువ సమయం నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా పూజ అయ్యే వరకు కొంతమంది స్త్రీలు ఎటువంటి ఆహారం కూడా తినటానికి ఇష్టపడరు. అయితే గర్వంతో ఉన్న మహిళలు ఇలా పూజ పూర్తయ్యే వరకు ఆహారం తినకుండా ఉండటంవల్ల వారి ఆరోగ్యం మీద దాని ప్రభావం ఉంటుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు దేవాలయాలకు వెళ్ళకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఇక గర్భంతో ఉన్న మహిళలు ఇంట్లో కూడా పూజ చేయడానికి అనుమతి ఉండదు ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎక్కువ సమయం కింద కూర్చొని పూజ చేయటం వల్ల వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇంట్లో కూడా గర్భిణీ స్త్రీలు పూజ చేయకూడదని పెద్దలు సూచిస్తూ ఉంటారు ఇలా గర్భిణీ స్త్రీలు పూజలు చేయకూడదని మన పెద్దలు చెప్పే విషయంలో శాస్త్రీయ కారణం ఉంది. అంతేతప్ప గర్భంతో ఉన్న మహిళలు పూజలు చేయడం వల్ల ఎటువంటి దోషం ఉండదని పండితులు సూచిస్తున్నారు.